ప్రభాస్ ప్రజెక్ట్ -k సినిమా రిలీజ్ డేట్ లాక్..!!

ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోగా పేరు పొందరు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ప్రభాస్ డైరెక్టర్ నాగ అశ్విన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రాజెక్ట్-k పేరుతో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన ఆటు అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా అడ్వాన్స్ టెక్నాలజీ రోబోటిక్స్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకంగా వెహికల్స్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా డిజైన్ చేసినట్లుగా డైరెక్టర్ ఇదివరకే క్లారిటీ ఇవ్వడం జరిగింది.

తాజాగా ఎటువంటి హడావిడి లేకుండా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మహాశివరాత్రి శుభాకాంక్షలు అంటూ తాజాగా ప్రాజెక్ట్ -k వచ్చే యేడాది జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది అంటూ తెలియజేశారు. కాగా డేట్ అనౌన్స్ చేసిన ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. పోస్టర్లు ఒక పెద్ద చెయ్యి నేలపై పడి ఉండగా దాని చుట్టూ అడ్వాన్స్ మిషన్ పడి ఉన్నాయి ఇక ఆ చేతి ముందు ముగ్గురు వ్యక్తులు గన్ పెట్టుకొని కనిపిస్తూ ఉన్నట్టుగా ఈ పోస్టర్లో తెలియజేయడం జరిగింది.

పోస్టర్ చూస్తుంటే మార్వెల్ మూవీస్ తరహాలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది అంటూ ఇటీవల గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో నిజం ఉందో తెలియాల్సి ఉంది ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్ దీపికా పదుకొనే దిశాపటాన్ని నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని రూ .500 కోట్ల బడ్జెట్ తో నిర్మాత అశ్వని దత్తు నిర్మిస్తున్నారు.

Share post:

Latest