నందమూరి తారకరత్న ఇకలేరు..!

ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గత 23 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. గుండెపోటు కారణంగా ఆరోగ్యం పాడైన ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించారు. శరీరంలోని పలు అవయవాలు పనిచేయకుండా పోయాయట. మెదడు సైతం తీవ్రంగా దెబ్బతింది ఈ నేపథ్యంలోనే విదేశీ వైద్యుల బృందం కూడా రంగంలో లోకి దిగింది.. ప్రత్యేక వైద్యం కూడా అందించారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. కానీ శనివారం రోజున ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.. అత్యంత విషమంగా మారింది.

Taraka Ratna Health:అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. కాసేపట్లో హెల్త్  బులెటిన్ | Taraka Ratna Health seems to be very critical

ఇకపోతే ఆయనను ఈరోజు హైదరాబాద్ కి తరలించాలని వైద్యులు కుటుంబ సభ్యులతో చర్చించారు.. కానీ అంతలోనే ఆయన కన్ను మూసినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి అటు సినీ ఇండస్ట్రీ .. ఇటు కుటుంబ సభ్యులు.. ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు. గత 23 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. బావమరిది యాత్రకు తన మద్దతు కూడా తెలిపారు… ఉన్నట్టుండి పాదయాత్రలో కుప్పకూలిన ఆయనను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పి ఈ ఎస్ ఆసుపత్రికి తరలించారు..

అక్కడ వైద్యులు అత్యవసర విభాగంలో ఆయనకు రాత్రి వరకు చికిత్స అందించారు. 23 రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం శనివారం మరింత క్షీణించడంతో విషమించి తుదిశ్వాస విడిచారు. తారకరత్న ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చి ఒకటో నెంబర్ కుర్రాడుతో ఒక మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2002లో తన సమీకరణ ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు 23 సినిమాలలో నటించారు. అమరావతి సినిమాలో సైకో క్యారెక్టర్ లో నటించి నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.

Share post:

Latest