తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మలయాళం ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక అలా వచ్చి స్టార్ హీరోయిన్గా కూడా సత్తా చాటుతున్న వారు చాలామంది ఉన్నారు. అలా కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, నిత్యా మీనన్, అను ఇమ్మానుయేల్, మాళవిక మోహన్ దాస్.. సాయి పల్లవి తదితర హీరోయిన్ల సైతం టాలీవుడ్లోకి అడుగుపెట్టి ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్గా పేరు పొందారు.
ఇక మలయాళం నుంచి వచ్చే అమ్మాయిలకు నటన అనేది తమ బ్లడ్ లోనే ఉంటుందని వారి నటనను చూస్తే మనకి అర్థమవుతుంది. కళ్ళతో మాయ చేస్తూ ఎలాంటి క్యారెక్టర్ నైనా సరే ఈజీగా చేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమకు వచ్చిన పాత్రను ఆస్వాదిస్తూ నటిస్తూ ఉంటారు. అందుకే వీరికి మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు.
అలా మలయాళంలో నుంచి టాలీవుడ్లోకి అడుగుపెట్టిన మరొక హీరోయిన్ సంయుక్తా మీనన్.. భీమ్లా నాయక్ సినిమా ద్వారా మొదటిసారి టాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ
ఆ తర్వాత పాప్ కార్న్ అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్గా అడుగు పెట్టింది.
ఆ తర్వాత పలు అవకాశాలు రావడంతో సంయుక్తా తనకు వచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ వెళ్తోంది. ఇక ఈమె నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు అందుకోవడంతో తాజాగా ధనుష్తో కలిసి సార్ సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ రోల్ స్టైల్ లో చీరకట్టు హెయిర్ స్టైల్ లో ఆకట్టుకునే విధంగా పలు ఫోటోలను షేర్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అది రాబోయే రోజుల్లో ఈమె గ్లామర్ తో కుర్రకారులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
Samyuktha Menon Morning Guys
HD link: https://t.co/V7Bw1NvAzG pic.twitter.com/qqgPr5F5z5— Actress Walls 🪄 (@ActressWalls) February 19, 2023