వీర సింహారెడ్డి పాటకు స్టెప్పులేసిన మెగా కోడలు..!!

ఈ ఏడాది మొదట్లో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ కూడా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. ముఖ్యంగా సుగుణసుందరి పాటు కూడా యూట్యూబ్లో పలు రికార్డు వ్యూస్ సైతం అందుకుంది. ఇక ఇందులో బాలయ్య, శృతిహాసన్ వేసిన మాస్ స్టెప్పులు సైతం వైరల్ గా మారాయి.

Meghana Kumar Photos : Pictures, Latest photoshoot of Meghana Kumar, Latest Images, Stills Of Meghana Kumar, HD Photos - Filmiforest
తాజాగా ఈ పాటకి మెగా కోడలు ప్రముఖ యాంకర్ మేఘన సూపర్ హిట్ పాటకు డాన్స్ వేయడం జరిగింది. మెగా కుటుంబానికి దూరపు బంధువైన కొణిదెల పవన్ తేజ తో మేఘన గత కొద్దిరోజుల క్రితం నిశ్చితార్థం చాలా అంగరంగ వైభవంగా చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఫంక్షన్ కి యాంకర్ సుమ, మెగాస్టార్ భార్య సురేఖ చిరంజీవి ,రాజీవ్ కనకాల, సాయి ధరంతేజ్ జబర్దస్త్ నటులు కూడా హాజరయ్యారు. నిత్యం గ్లామర్స్ తో ఫోటోలతో సూపర్ హిట్ పాటలకు డ్యాన్సులు వేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది మేఘన.

తాజాగా ఈ పాటకి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.కాగ కొణిదెల పవన్ ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాలో మేఘన హీరోయిన్గా నటించింది ఆ తర్వాతనే వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది దీంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Megghanaa (@m_y_megganna)

Share post:

Latest