అజిత్ దెబ్బ‌కు బైక్ కొనేసిన మంజు వారియర్.. ఖ‌రీదు తెలిస్తే షాకే!

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న అజిత్‌.. వృత్తి ప‌రంగా న‌టుడు. కానీ బైక్ రైస్‌, రైఫిల్ షూటింగ్ ఆయ‌న ప్ర‌వృత్తి. అలాగే షూటింగ్ నుంచి గ్యాప్ దొరికిందంటే చాలు బైక్ పై టూర్స్ వేసేస్తుంటారు. అజిత్‌కు బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. ఆయన బైక్‌ ఎక్కడాంటే ఎక్కడ బ్రేక్ వేస్తాడో కూడా తెలియదు. ఇలా బైక్ పైనే సుదీర్ఘ ప్రయాణాన్ని చేస్తుంటారు అజిత్.

అయితే ఇప్పుడు అజిత్ ఫీప‌ర్ మలయాళ బ్యూటీ మంజు వారియ‌ర్ కు పాకింది. వీరిద్ద‌రూ తొలిసారి `తునివు(తెలుగు తెగింపు)` సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే `తునివు` షూటింగ్ సమయంలో అజిత్ ప్రత్యేకంగా బైట్ టూర్ చేసిన విషయం తెలిసిందే. మంజు వారియర్ కూడా అజిత్ తో కలిసి బైక్ టూర్ కి వెళ్లడం విశేషం.

అజిత్ తో ఏర్పడిన పరిచయం కారణంగా మంజు వారియ‌ర్‌ కూడా బైక్ రేసింగ్ పై ప్రత్యేక ఆసక్తిని పెంచుతుంది. అంత‌టితో ఆగ‌లేదు అజిత్ దెబ్బ‌కు ఓ సూపర్ బైక్ ను కొనేసింది. BMWRL1250 GS బైక్ ను మంజు తాజాగా త‌న సొంతం చేసుకుంది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా తెలిపింది. తాను కూడా బైక్ రైడ‌ర్ గా మార‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇక ఈ బైక్ ఖ‌రీదు తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే, మంజు వారియ‌ర్ అక్ష‌రాల రూ. 21 ల‌క్ష‌లు పెట్టి ఆ సూప‌ర్ బైక్ ను కొనుగోలు చేసింది.

https://www.instagram.com/reel/CoxNgp-DHCT/?utm_source=ig_web_copy_link

Share post:

Latest