ఇట్స్ అఫీషియ‌ల్‌.. పెళ్లైన హీరోకు రెండో భార్య కాబోతున్న `ఒంగోలు గిత్త` హీరోయిన్‌!

కృతి కర్బంద.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులోనే సినీ కెరీర్ ప్రారంభించిన కృతి క‌ర్బంద‌.. ఆ త‌ర్వాత క‌న్న‌డ‌లో అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. అలాగే తెలుగులో ప‌లు సినిమాల్లో మెరిసింది. ముఖ్యంగా తీన్ మార్, ఒంగోలు గిత్త వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది.

ఆ త‌ర్వాత బాలీవుడ్ కు మ‌కాం మార్చి.. అక్క‌డ ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్ లో న‌టించింది. ఇదిలా ఉంటే.. కృతి క‌ర్బంద ప్రేమ‌లో ప‌డింది. అది కూడా పెళ్లైన హీరోతో. బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో ప్రేమలో ఉన్నట్లు వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశసింది. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి పీట‌లెక్కబోతున్నార‌ని తెలుస్తోంది.

అయితే పులకిత్ సామ్రాట్ కు ఇంత‌కు ముందే వివాయం అయింది. శ్వేతా అరోరా అనే బాలీవుడ్ హీరోయిన్ ని పుల‌కిత్ పెళ్లి చేసుకున్నాడు. కానీ, వీరిద్ద‌రూ ప‌లు మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా విడిపోయారు. ఇక ఇప్పుడు పెళ్లైన పుల‌కిత్ సామ్రాట్ కు కృతి క‌ర్బంద రెండో భార్య కాబోతోంది. మ‌రికొద్ది రోజుల్లో వీరి పెళ్లి అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

Share post:

Latest