నందమూరి తారకరత్న మరణ వార్తతో అటు నందమూరి కుటుంబంలో, సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రత్యేకమైన వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న తారకరత్న నిన్నటి రోజున రాత్రి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మెదడుకు సంబంధించిన సమస్యల వల్ల తారకరత్న మృతి చెందారని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం. తారకరత్న మరణ వార్తను ఆయన అభిమానులు అసలు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే చివరి కోరిక తీరకుండానే తారకరత్న మృతి చెందారని వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కానీ తారకరత్న ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వాలని పలు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలా జరిగింది. అయితే చివరి కోరిక తీరకుండానే తారకరత్న మృతి చెందారని పలు కథలు వినిపిస్తున్నాయి. తారకరత్న బ్రెయిన్ డెడ్ కావడం వల్లే ఆయన మృతి చెందారని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం. దీంతో తారకరత్నకు సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇక తారకరత్న చేతి పై టాటో బొమ్మ ఉంది అది కూడా సింహం ముద్రతో పాటు బాలయ్య ఆటోగ్రాఫ్ ఉండడం విశేషము.

దీంతో ఈ టాటూ ప్రత్యేకత ఏమిటంటే బాబాయ్ బాలయ్య పై ఉన్న అభిమానంతో తారకరత్న ఈ టాటూ వేయించుకున్నట్లు తెలుస్తోంది. తారకరత్న కెరియర్ పరంగా సక్సెస్ కావాలని కష్టపడ్డ వారిలో బాలయ్య కూడా ఒకరు. అయితే తారకరత్న నటించిన ఎన్నో సినిమాలలో కొద్ది సినిమాలు సక్సెస్ సాధించగా మరికొన్ని సినిమాలు ప్లాప్ గా నిలిచాయి. తారకరత్న మరణ వార్త విన్నప్పటి నుంచి బాలయ్యను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు అన్నట్లుగా తెలుస్తోంది.ఇంతటి బాధలో ఉన్నప్పటికీ తారకరత్న భార్య పిల్లలకు మాత్రం బాలయ్య ధైర్యం చెబుతూ ఉన్నారట. అంతలా బాలయ్య తారకరత్న మధ్య బంధం ఏర్పడిందని చెప్పవచ్చు.

