నటి దివ్యవాణికి ఎంత ఆస్తి ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

దివ్యవాణి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ సూపర్ హిట్ ఫిలిం ‘పెళ్లి పుస్తకం’తో సహా చాలా హిట్ సినిమాల్లో నటించింది. పెళ్లి పుస్తకం మూవీలోని ‘శ్రీరస్తు.. శుభమస్తు… శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం’ పాట ఎవర్ గ్రీన్ హిట్ అయింది. ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాట ద్వారా దివ్యవాణి అందరికీ గుర్తిండి పోయేంత గుర్తింపు తెచ్చుకుంది. ఇక దివ్యవాణి ఇప్పటివరకు 40 సినిమాలకు పైగా నటించింది. చివరగా మహానటిలో కనిపించింది. ఈ తార సీరియళ్లలో కూడా నటిస్తూ అలరిస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన భర్త గురించి, ఆస్తుల గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గతంలో తనని కోవర్టు అని కామెంట్లు చేసిన వారిపై కూడా ఈ సందర్భంగా స్పందించింది. ఇల్లీగల్‌గా, ఎవరికీ తెలియకుండా తాను డబ్బులు ఏమీ సంపాదించలేదని ఆమె వెల్లడించింది. తాను ఎంత నిజాయితీగా బతుకుతున్నానో తనకు తెలుసునని ఆమె పేర్కొంది. అలాగే తాను ఎప్పుడూ సింపుల్ లైఫ్ గడపాలని కోరుకుంటానని తెలిపింది.

ఇకపోతే తండ్రి చనిపోయినప్పుడు తాను ఎంతో బాధపడ్డానని చెప్పింది. తన బాబు తనకి ఎదురు తిరిగినప్పుడు కూడా చాలా బాధ వేస్తుందని, పిల్లలు చెప్పిన మాట వినకపోతే ఆ బాధ వర్ణనాతీతమని చెప్పుకొచ్చింది. ఇక తన జీవితం గురించి మాట్లాడుతూ తాను ఒక ప్రముఖ కాఫీ ఎస్టేట్ ఓనర్‌ను పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. తనకు వందల, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో కొంచెం కూడా నిజం లేదని కుండ బద్దలు కొట్టింది. ఇకపోతే 2019లో టీడీపీలో చేరిన ఈ నటి 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసింది.