గోల్డెన్ ఆఫర్స్ మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే..!!

హీరోయిన్లు అనగానే మనకు వాళ్ల అందం, అభినయం గుర్తుకు వస్తుంది. ఎంత అందం, టాలెంట్ ఉన్నప్పటికీ సరైన సినిమా చేస్తేనే నటులకు గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా కొన్ని సినిమాలను ఏవో కారణాల వల్ల రిజెక్ట్ చేసేస్తారు. కాల్షీట్లు కుదరలేదనో, అనారోగ్యం వల్లనో మంచి చాన్సులు మిస్ చేస్తారు. తీరా వీరు వదిలేసిన సినిమాలు బ్లాక్ బస్టర్లు అవుతాయి. దీంతో కథ నచ్చకో, తమకు ప్రాధాన్యం లేదనో, లేక కాల్షీట్లు ఖాళీ లేవనో ఉద్దేశంతో ఆ సినిమాలు వదిలిన హీరోయన్లు బాధ పడతారు. ప్రస్తుతం అందం, టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ సరైన సినిమాలు లేక కొందరు హీరోయిన్లు ఉన్నారు. వారు గతంలో వదిలేసిన హిట్ సినిమాల గురించి తెలుసుకుందాం.

టాలీవుడ్‌లో బాహుబలి, గీతాగోవిందం, రంగస్థలం వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమాలు నిర్మాతలకు కాసులు కురిపించాయి. అలాంటి ఈ సినిమాలలో మొదటగా అనుకుంది ఆ హీరోయిన్లను కాదు. 2018లో రూ.5 కోట్లతో తెరకెక్కిన గీతగోవిందం సినిమా ఏకంగా రూ.135 కోట్లను వసూలు చేసింది. ఇందులో జంటగా నటించిన విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నాలకు మంచి పేరు వచ్చింది. అయితే విజయ్ సరసన మొదటగా రాశి ఖన్నాను మేకర్స్ అనుకున్నారు. ఆమె కాల్షీట్లు కేటాయించలేకపోవడంతో గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్నట్లయింది. రాశిఖన్నా గతంలో F2 సినిమాను కూడా ఇదే తరహాలో వదులుకుంది. తమన్నా పాత్రలో ఆమె నటించాల్సి ఉంది. ఇక రామ్ చరణ్-సమంత జంటగా తెరకెక్కిన రంగస్థలం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సమంత కంటే ముందు హీరోయిన్ ఛాన్స్ అనుపమ పరమేశ్వరన్‌కు వచ్చింది. చివరికి ఈ సినిమా ఛాన్స్ సమంతకు రావడం, ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం చకచకా అయిపోయాయి. ఇక బాహుబలి సినిమా భారత సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుంది.

రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా చేసిన పాత్రకు మొదటిగా సోనమ్‌కపూర్‌ని అడిగారు. ఆమె ఓకే చెప్పకపోవడంతో తమన్నాకు ఈ ఛాన్స్ దక్కింది. మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్, నాని నటించి జెర్సీ మూవీలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలలో శృతి హాసన్ నటించాలి. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాలను వదులుకుంది. ఇలా చిన్న చిన్న కారణాలతో ఈ భామలు మంచి సినిమాలు వదిలేసుకుని, అన్ లక్కీ హీరోయిన్లుగా మిగిలిపోయారు.

Share post:

Latest