కమర్షియల్ సినిమాలను గాలికి వదిలేసిన హీరోలు.. హిట్స్ కొట్టడం కష్టమా??

 

ఒకప్పుడు సినిమా అంటే ఒక ప్రేమ కథ దాంట్లో ఫైటింగ్స్, హీరో హీరోయిన్ల రొమాన్స్, ఒక నాలుగు పాటలు ఉండేవి. కానీ ప్రేక్షకులకు ఇప్పుడు ఆ రొటీన్ కథలు నచ్చడం లేదు. దాంతో దర్శకులు కూడా కాస్త కొత్త కథలను తీయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ పాత రోటీన్ కమర్శియల్ సినిమాలు విడుదల అయినా కూడా ప్రేక్షకులకు దానిని పెద్దగా పట్టించుకోడం లేదు. అందుకే ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ సినిమాలలో చాలా మార్పు వచ్చింది. పెద్ద హీరోలు ఎక్సపరిమెంట్స్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. కమల్, విజయ్ సేతుపతి ఫహద్ ఫాజిల్ నటించిన విక్రమ్ టాలీవుడ్‌లో రికార్డు వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే, ఇక కన్నడ మూవీ కాంతారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న హీరోలు సైతం కొత్త జోనర్స్ ను ట్రై చేస్తున్నారు.

 

 

ఈ సమ్మర్ లో వెండితెర పై ప్రేక్షకుల్ని అలరించడానికి రవితేజ రావణాసుర సినిమా తో రానుండగా, సాయి ధరమ్ తేజ్ కూడా ఒక థ్రిల్లర్ కథాంశం తో రెడీ అవుతున్నాడు. రామ్ పోతినేని మాస్ బ్యాక్ డ్రాప్ తో వస్తుండగా, నిఖిల్ స్పై, అఖిల్ ఏజెంట్, నాని దసరా మూవీస్ తో రెడీ గా ఉన్నారు. పాత చింతకాయ పచ్చడి కథలు తెలుగు ప్రేక్షకులకు రుచించట్లేదు. చిన్న హీరోలు సైతం మంచి కథలతో వస్తేనే విజయం వరించే అవకాశం ఉంది.

 

అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా ఉంటే వాటికి మినిమం గ్యారెంటీ ఉంటుంది. అవి హిట్ కాకపోయినా మరీ అట్టర్ ఫ్లాప్ కావు. అయితే కొత్త కథాంశం లేదా స్టోరీ ప్రేక్షకులకు ఎక్కకపోతే.. లేదంటే నచ్చకపోతే అవి దారుణంగా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న హీరోలు హిట్స్ కొడతారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా కొత్త కంటెంట్ తీసుకురావాలని హీరోలు పడుతున్న తపనను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే!