ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరో శింబు.. అమ్మాయి ఎవరంటే..?

ఏ ఇండస్ట్రీలో నైనా ప్రేమ వ్యవహారాలు బ్రేకప్ వ్యవహారాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. ఇద్దరు కంటే ఎక్కువ మందిత ప్రేమలో పడ్డ సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా హీరోలు ఎక్కువగా ప్రేమ వ్యవహారాలలో నిలుస్తూ ఉంటారు. ఇలా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. సౌత్ లో మాత్రం హీరో సిద్ధార్థ్, శింబు ,సల్మాన్ ఖాన్ ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయాన్ని నడిపారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

புளியங்கொம்பாக பிடித்த சிம்பு.. ஜோராக நடக்கும் திருமண ஏற்பாடு -  DailyVision360
ఇక హీరో శింబు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. శింబు ఒక కోటేశ్వరరావు అయిన అమ్మాయితో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మాయి శ్రీలంక ప్రాంతానికి చెందిన అమ్మాయి అన్నట్లుగా సమాచారం. ఈమె ప్రస్తుతం డాక్టర్ చదువుతున్నట్లుగా తెలుస్తోంది. ఈమె శింబు కు ఒక పెద్ద ఫ్యాన్ అట. ఈమె తండ్రి కూడా కొన్ని వందల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. వీరి పెళ్లికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లుగా సమాచారం. మరి ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియాలి అంటే ఈ విషయంపై శింబు కుటుంబం స్పందించాల్సి ఉంటుంది. గతంలో శింబు ప్రముఖ హీరోయిన్ నయనతార తో ప్రేమ వ్యవహారం నడిపారు ఆ తర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు. మళ్లీ హీరోయిన్ హన్సికతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మరొక హీరోయిన్ తో కూడా ప్రేమలో పడినట్లుగా వార్తలు వినిపించాయి. కానీ అదంతా ఒట్టి పుకార్లే అంటే హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది.

Share post:

Latest