పెళ్లి త‌ర్వాత సినిమాలు మానేయ‌డం వ‌ల్లే ఇలా ఉన్నా.. జెనీలియా షాకింగ్ కామెంట్స్‌!

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ జెనీలియా.. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుని ముంబైలో స్థార‌ప‌డింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై.. త‌న పూర్తి స‌మ‌యాన్ని భర్త పిల్లలకు కేటాయించింది.

అయితే త‌న ఇద్ద‌రు కుమారులు ఇప్పుడు కాస్త పెద్ద‌వారు కావ‌డంతో మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది. ఇందులో భాగంగానే `వేద్‌(మ‌జిలీ రీమేక్‌)`తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో త‌న భ‌ర్త రితేష్ తో క‌లిసి న‌టించింది. ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ తో ఫుల్ జ్యోష్‌లో ఉన్న జెనీలియా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె పెళ్లి త‌ర్వాత సినిమాలు ఎందుకు మానేయాల్సి వ‌చ్చిందో వివ‌రిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

`జీవితంలో ఒకటి కావాలంటే మరొకటి వదిలేయాల్సిందే. రెండు పడవల మీద ప్రయాణం సాగదు. పెళ్లి త‌ర్వాత సినిమాలు చేస్తూ ఇంటిని చూసుకోవడం కుదరలేదు. అందుకే సినిమాలు వదిలేశా. అలా చేయడం వల్లే ఇప్పుడు ఒక మంచి ఇల్లాలిగా కుటుంబంలో పేరు తెచ్చుకున్నా. ప్రొడ్యూసర్‌గా సొంత ప్రొడక్షన్‌ చేస్తున్నా. మరికొన్ని వ్యాపార సంస్థలూ స్థాపించగలిగా. ఇక ఇన్నేండ్ల తర్వాత ప్రేక్షకులు నన్ను మళ్లీ నటిగా ఆదరించడం చాలా ఆనందంగా ఉంది` అంటూ జెనీలియా చెప్పుకొచ్చింది.

Share post:

Latest