మైఖేల్ సినిమా కూడా సందీప్ కిషన్ ని కాపాడలేకపోయిందా..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోలలో మంచి టాలెంటెడ్ కలిగిన హీరో సందీప్ కిషన్ మొదట స్నేహ గీతం సినిమాతో నటుడుగా తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఆ తరువాత ఎన్నో మూవీస్ లో నటించారు. తన కెరియర్లో చెప్పుకోదగ్గ సక్సెస్ ఏమిటంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా అని చెప్పవచ్చు. ఆ తర్వాత నీను వీడని నీడను నేనే అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక నగరం సినిమాతో కూడా పరవాలేదు అనిపించుకున్నారు సందీప్ కిషన్. ఈ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు

Michael Box office: Sundeep Kishan's film collects Rs 4.6 crore on day one-  Cinema express
ఇక ఆ తర్వాత మాతృభాష తమిళ్ అయిన తెలుగులో కూడా సక్సెస్ కొట్టాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు. తాజాగా సందీప్ కిషన్ మైఖేల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మాఫియా బ్యాక్ డ్రాప్ కథలకు మంచి డిమాండ్ ఉన్నది. తాను కూడా అలాంటి కథాంశంతోనే పీరియాడిక్ జోన్లని తీసుకువచ్చి మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది నెగటివ్ టాకును తెచ్చుకున్నట్లు సమాచారం.

భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్నప్పటికీ ఎమోషనల్ ఎలిమెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తారని హౌస్ పెట్టుకొని విడుదల చేసిన మైఖేల్ మూవీ నిరాశనే మిగిల్చిందని తెలుస్తోంది. దీంతో మరొకసారి సందీప్ కిషన్ పరాజయాన్ని పొందాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తనతో నెక్స్ట్ సినిమాని కూడా ప్రేమ కథగా చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమా కూడా కెరియర్లో ఏమాత్రం తగ్గకుండా చేసుకుంటూ వెళ్తున్నారు సందీప్ కిషన్.

Share post:

Latest