జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య ఎవ‌రో తెలుసా..? ఆమె సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారే!

ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అడ‌గ‌క‌పోయినా సెల‌బ్రిటీల జాత‌కం చెబుతూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఆయ‌న వాటిలో కొన్ని నిజం కావడంతో వేణు స్వామి బాగాఫేమస్ అయ్యాడు. అయితే ఈయ‌న చెప్పే విష‌యాల‌ను కొంద‌రు న‌మ్ముతారు.. మ‌రికొంద‌రు కొట్టిపారేస్తుంటారు. ఇక‌పోతే వేణు స్వామి వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు.

ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. వేణు స్వామి భార్య సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారే. ఇండ‌స్ట్రీలో వీణ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న‌ వీణ శ్రీవాణినే వేణు స్వామి వివాహం చేసుకున్నారు. పైగా వీరిది ప్రేమ వివాహం. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ షాకింగ్ సీక్రెట్ ను శ్రీ‌వాణి స్వ‌యంగా వెల్ల‌డించారు. శ్రీ‌వాణి ఎంత అందంగా ఉంటారో.. అంతే అందంగా వీణ‌ను వాయిస్తారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌వాణి.. త‌న ల‌వ్ స్టోరీ గురించి బ‌య‌ట‌పెట్టింది.

ఆంధ్రా ప్రాంతానికి చెందిన శ్రీవాణిది పూర్తి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఇంటర్ చదివే రోజుల నుంచే పిల్లలకు వీణా క్లాసులు చెప్పేవారు. అయితే ఇండియన్ రైల్వేస్ లో జాబ్ రావ‌డంతో.. ఆమె ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. అక్కడ కూడా వీణ క్లాసులు చెప్పేది. వేణు స్వామి వాళ్ళ కజిన్ డాటర్ కూడా శ్రీ‌వాణి క్లాసులకు వచ్చేవారు. ఓ రోజు ఆమెను తీసుకెళ్లేందుకు వేణు స్వామి అక్క‌డికి వెళ్లార‌ట‌.

అక్కడ శ్రీవాణిని చూసి తొలి చూపులోనే ప్రేమలో ప‌డ్డ వేణు స్వామి.. చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడ‌ట‌. శ్రీ‌వాణికి ప్ర‌పోజ్ కూడా చేశాడ‌ట‌. వేణు స్వామి మంచిత‌నం తెలిసి శ్రీ‌వాణి వెంట‌నే ఓకే చెప్ప‌డం.. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగాయి. వేణు స్వామిని శ్రీ‌వాణి ముద్దుగా తిరుపతి లడ్డూ అని పిలుస్తుంద‌ట‌. ఇక‌పోతే వివాహం అనంత‌రం భ‌ర్త స‌ల‌హా మేర‌కు శ్రీ‌వాణి సినిమా పాటలు కూడా చేయడం ప్రారంభించింది. త‌ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపుల‌ర్ అయింది.

 

Share post:

Latest