తారకరత్న మరణంతో.. తెరపై వైరల్ గా మారిన వేణు స్వామి వ్యాఖ్యలు.!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సెలబ్రిటీలకు.. రాజకీయ నాయకులకు వారి వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి జాతకాలు చెబుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఎంతోమంది సెలబ్రిటీల విషయంలో ఈయన చెప్పింది చెప్పినట్టు దాదాపు జరిగిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తో వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు తెరపైకి వచ్చి మరింత వైరల్ గా మారుతున్నాయి.

Dailyhunt

యూట్యూబ్ ఛానల్ ప్రతినిధితో 45 సంవత్సరాలు లోపు మేషరాశికి చెందిన యంగ్ హీరోయిన్ .. వృశ్చిక లేదా మిధున రాశికి చెందిన యంగ్ హీరో మరణిస్తారు.. అది నేచురల్ డెత్ అయినా కావచ్చు లేదా ఆత్మహయ్య అయినా కావచ్చు అంటూ ఆయన తెలిపిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. అంతేకాదు కొంతమంది వేణు స్వామి మాటలను కొట్టి పారేస్తే మరికొంతమంది నిజమే నేమో అని భ్రమపడ్డారు. అయితే అది అనుకున్నట్టుగానే ఇప్పుడు తారకరత్న మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో వేణు స్వామి చెప్పిన మాటలు మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి. తారకరత్న గుండెపోటుతో 40 సంవత్సరాలకే మరణించడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

యంగ్ హీరో మరణించాడు మరి ఆ యంగ్ హీరోయిన్ ఎవరు అనే విషయంపై ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న మరణంతో వేణు స్వామి మాటలు నిజమయ్యాయి అని చెప్పడంలో సందేహం లేదు. వేణు స్వామి గతంలో కూడా సమంత, నాగచైతన్య వివాహం చేసుకునేటప్పుడు వీరి జాతకం ప్రకారం ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే వారు కూడా నాలుగు సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా వరుసగా వేరు స్వామి చెబుతున్న సంఘటనలు నిజం అవడం చూస్తుంటే సినీ ఇండస్ట్రీ భయాందోళనకు గురి అవుతుంది. తారకరత్న మరణంతో వేణు స్వామి పై ప్రతి ఒక్కరికి నమ్మకం పెరుగుతోంది.

Share post:

Latest