ఆదిపురుష్‌ సంచలనం.. ఒక్కో సీన్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా..??

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఇంకో పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఈ సినిమాను 2023 జూన్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సమయం దగ్గరి పడే కొద్దీ సినీ ప్రేమికులకు ఊసహం ఎక్కువైయిపోతుంది. ప్రేక్షకులందరు ఆదిపురుష్ సినిమా పై ఎక్కువగా దృష్టి పెడుతుండటంతో కొత్త సినిమాల అప్‌డేట్స్‌ గురించి చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడట ప్రభాస్. ఎందుకంటే కొత్త అప్‌డేట్స్‌ తెలిస్తే ఆడియన్స్ అటెన్షన్ అంతా ఆదిపురుష్ సినిమా నుంచి వేరే వైపుకి మళ్ళుతుంది అని ప్రభాస్ ఆలోచన.

ఇక ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సంచలనం సృష్టించేలా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో రావణుని పాత్రలో నటించిన రాఘవ్, రాముని పాత్రలో నటించిన ప్రభాస్ ల ఒక సీన్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ ఒక్క సీన్ కోసం ఏకంగా 12 కోట్లు ఖర్చుచేశారట మేకర్స్. దీనిని 3D లో చూస్తే ఆ సన్నివేశం ఇంకా అద్భుతంగా కనబడుతుందని అంటున్నారు. ఇంకా ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు ఎన్ని ఉన్నాయో వాటి కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో అని అభిమానులు ఊహాగానాలు చేసుకుంటున్నారు.

ఇక ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్ ‘సీత’ పాత్రలో నటించగా, అలీ ఖాన్ రావణుడిగా నటించారు. అలానే లక్ష్మణుడు, హనుమంతుడిగా సన్నీ సింగ్, దేవ్ దత్ నాగే నటించారు. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా కంటే ఈ సినిమా గొప్పగా ఉంటుందా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఈ సినిమా హిట్ అయితేనే ప్రభాస్ క్రేజ్ తగ్గకుండా ఉంటుంది. లేదంటే  అతను సలాడ్ సినిమాతోనైనా హిట్ కొట్టక తప్పదు.

Share post:

Latest