గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి పునర్నవి..!!

తెలుగులో మొదట ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా నటిగా పేరు పొందింది పునర్నవి భూపాలం. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయింది ఈ ముద్దుగుమ్మ. ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించిన ఈ అమ్మడు.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో శర్వానంద్ కూతురుగా నటించింది. ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ కావాలంటే పిట్టగోడ, అమ్మకు ప్రేమతో, నీ సాదిక, మనస్సుకు నచ్చింది వంటి చిత్రాలలో నటించింది. చివరిగా 2021 లో సైకిల్ చిత్రంలో నటించింది.

Punarnavi Bhupalam Comedy Scenes Back to Back | Latest Telugu Movie Comedy  | Sri Balaji Video - YouTubeఇక తర్వాత తన తదుపరి చిత్రాలను పెద్దగా ప్రకటించలేదు. ఒక బిగ్ బాస్ లో పాల్గొన్న ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఏదో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. దీంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటోంది. అయితే ఈ ముద్దుగుమ్మ గత కొద్దిరోజులుగా విదేశాలలోనే ఉంటోంది. అక్కడ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. గ్లామరస్ ఫోటోలతో కుర్రకారులను బాగా అలరిస్తూ ఉండేది.

తాజాగా తను పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెంచుకుంది .ప్రస్తుతం లండన్ లో ఉన్నట్లు క్యాప్షన్స్ పెడుతూ ఫోటోలను షేర్ చేసింది పునర్నవి భూపాలం. దీంతో ఈ అభిమానులు ఈమె ఫోటోలు చూసి పునర్నవి ఇమే ఇంతలా మారిపోయింది. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పునర్నవి ఫోటోలు చూసి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest