మీనా ఈస్ బ్యాక్‌.. పాపుల‌ర్ సాంగ్ కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన అందాల తార‌!

అలనాటి అందాల తార మీనా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మీనా సౌత్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగు వెలిగింది. హీరోయిన్ గా అవకాశాలు త‌గ్గిన త‌ర్వాత‌ సహాయక పాత్రలు పోషిస్తూ సత్తా చాటుతోంది. ఇక లైఫ్ అంతా సాఫీగా వెళుతున్న సమయంలో మీనా జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది.

ఆమె భర్త విద్యాసాగర్ గత ఏడాది హఠాన్మ‌రణం చెందిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో బాధ‌ప‌డుతూ ఆయన మృతి చెందారు. భర్త మరణం నుంచి కోలుకునేందుకు మీనా చాలా సమయం తీసుకుంది. ఇక కూతురు నైనిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. వరుస సినిమాలతో బిజీ అయింది.

అలాగే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్న మీనా.. తాజాగా ఓ పాపులర్ సాంగ్ ప్రముఖ నటి సంఘవితో కలిసి డాన్స్ ఇర‌గ‌దీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. మీనా ఈస్ బ్యాక్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CorlVEMLhXb/?utm_source=ig_web_copy_link

Share post:

Latest