తారకరత్న హెల్త్ పై బాలయ్య ఏమన్నారంటే..!!

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బాలకృష్ణ స్పందించడం జరిగింది.. మాసివ్ హార్ట్ ఎటాక్ తో తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.హార్ట్ బీట్ కాసేపు ఆగిపోయినట్టుగా కూడా తెలియజేశారు ఆ తర్వాత మిరాకిల్ జరిగి హార్ట్ బీట్ మొదలయ్యిందని తెలిపారు. బెటర్ ఐ సి యు కేర్ కోసం నారాయణకు హృదయాలకు తీసుకువచ్చినట్లుగా తెలియజేశారు బాలయ్య. తారకరత్న వైద్యం కోసం స్పెషల్ డాక్టర్లని పిలిపిస్తున్నట్లుగా కూడా తెలియజేశారు. కుప్పం నుంచి ఏ పరిస్థితుల్లో తీసుకోవచ్చారు అదే పరిస్థితుల్లో ఉందని ప్రజెంట్ అంతా నిలకడగానే ఉందని తెలిపారు.

Why Tarakaratna body turned into blue colour after massive heart attack -  తెలుగు News - IndiaGlitz.com
పరిస్థితి దిగజారలేదని ఇంప్రూవ్మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని బాలయ్య తెలిపారు. డాక్టర్లు అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా కూడా తెలియజేయడం జరుగుతోంది. తారకరత్న అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అని కోసం అందరూ ప్రార్థనలు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరి ఆశీస్సులు ప్రార్థనలతోనే తారకరత్న త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని తెలిపారు బాలయ్య. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా తారకరత్నకు స్టంట్ వేయడం కుదరలేదని ఇలా చేస్తే మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందని కూడా తెలిపారు.

అందుకే డాక్టర్లు స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా కూడా తెలియజేశారు. ప్రజెంట్ తారకరత్న వెంటిలేటర్ పైన ఉన్నట్లు తెలిపారు గిచ్చినప్పుడు ఒకసారి రెస్పాండ్ అవుతున్నారని మరొకసారి రెస్పాండ్ కావడం లేదని కూడా తెలియజేశారు.. కాస్త కళ్ళు మూమెంట్ కూడా ఉందని బ్రెయిన్ డ్యామేజ్ ఎంతవరకు అయ్యిందో ఆ తర్వాత తెలుస్తుందని తెలిపారు. తెలుగు కన్నడ ప్రజలు చేస్తున్న ప్రార్థనలకు బాలయ్య ధన్యవాదాలు తెలియజేశారు.

Share post:

Latest