అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగుళూరుకు ఎన్టీఆర్‌-క‌ళ్యాణ్‌రామ్‌!

సినీనటుడు నందమూరి తారకర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌యంగా మారింది. బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నారు. దాదాపు పది మంది వైద్యుల బృందం తార‌క‌ర‌త్న‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

తారక రత్నను కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా.. ఆయ‌న ఆరోగ్యం ఏమాత్రం బెటర్‌ కావడం లేదని, మరింత ఆందోళనకరంగా మారుతుందని మేనత్త, బీజీపీ నాయకురాలు పురందేశ్వరి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆయన బాడీలో మల్టీఫుల్ గా ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ జరుగుతుందని, అది కంట్రోల్ కావడం లేదని తెలుస్తుంది. అలాగే తారకత్నకు మెలెనా వ్యాధి ఉన్నట్లు భావిస్తున్నారు.

దానివల్ల చిన్నప్రేవులో రక్తస్రావం జరుగుతోందని.. ఈ వ్యాధి లక్షణాలున్న వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక‌పోతే తారకరత్నను చూసేందుకు ఇవాళ బెంగళూరుకు జూ.ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్ ప్ర‌త్యేక విమానంలో వెళ్ల‌బోతున్నారు. వీళ్లిద్దరితోపాటు కుటుంబ సభ్యులు కూడా నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు. నిన్న తారకరత్నను చూసేందుకు చంద్రబాబు, నందమూరి కుటుంబసభ్యులు వచ్చారు. అయితే ఇలా ఫ్యామిలీ మొత్తం ఆసుపత్రికి చేరుకుంటున్న నేపథ్యంలో అభిమానుల్లో మరింత ఆందోళన పెరుగుతుంది.

Share post:

Latest