ఫైన‌ల్ గా ప్రియుడితో పెళ్లి పీట‌లెక్కేస్తున్న త‌మ‌న్నా.. ఎంగేజ్మెంట్ డేట్ లాక్‌!?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలుతుంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గోవా వేదిక‌గా జ‌రిగిన న్యూ ఇయ‌ర్ పార్టీలో విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా హ‌గ్గుల‌తో, ముద్దుల‌తో రెచ్చిపోయిన వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో.. వీరి ల‌వ్ ఎఫైర్ వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి.

ఆ త‌ర్వాత ప‌లు మార్లు వీర‌ద్ద‌రూ ముంబైలో జంట‌గా మీడియాకు చిక్కారు. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు అటు త‌మ‌న్నా కానీ, ఇటు విజ‌య్ వ‌ర్మ కానీ ల‌వ్ ఎఫైర్ వార్త‌ల‌పై స్పందించ‌లేదు. అలాగే ఖండించ‌నూలేదు. దీంతో విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా ప్రేమ‌లో ఉన్న‌ది నిజ‌మే అని చాలా మంది న‌మ్ముతున్నారు. అయితే తాజాగా వీరిద్ద‌రికీ సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది.

అదేంటంటే.. త‌మ‌న్నా ఫైన‌ల్ గా ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌తో పెళ్లి పీట‌లెక్కేందుకు రెడీ అయిందట‌. ఇరు కుటుంబ‌స‌భ్యుల అంగీకారంతో వీరు వివాహం చేసుకోబోతున్నార‌ట‌. ఎంగేజ్మెంట్ డేట్ కూడా లాక్ అయింద‌ని బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. ప్రేమికుల కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ ఎంగేజ్మెంట్ ముంబైలో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంద‌ని.. ఇక ఏప్రిల్ 21న మూడు ముళ్ల బంధంలో వీరిద్ద‌రూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్ట‌నున్నార‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.