మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఎన్ని కోట్ల‌కు అధిప‌తో తెలుసా?

సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్ల జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. సౌత్ తో పాటు నార్త్ లోనూ స్టార్ ఇమేజ్ న్యూ సొంతం చేసుకున్న తమన్నా.. మూడు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటుంది. ఇక ఇన్నేళ్ల సినీ కెరియర్ లో తమన్నా ఆస్తులను కూడా బాగానే కూడా పెట్టింది.

అసలు మ‌న మిల్కీ బ్యూటీ ఎన్ని కోట్లకు అధిప‌తో తెలిస్తే కళ్ళు తేరేస్తారు. 17 ఏళ్ల కెరీర్ త‌మ‌న్నా.. ఓవైపు సినిమాలు, వెబ్ సిరీస్ ల‌తో పాటు మ‌రోవైపు ప‌లు బ్రాండ్స్ కు ప్ర‌చారకర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ తీసుకునే త‌మ‌న్నా.. ఐటెం సాంగ్ చేస్తే రూ. 60 లక్షలు ఛార్జ్ చేస్తుంద‌ట‌. త‌మ‌న్నా వార్షిక ఆదాయం రూ. 12 కోట్లు అని అంటున్నారు.

తమన్నా 2015లో `వైట్ అండ్ గోల్డ్` పేరిట జ్యువెలరీ వ్యాపారం ప్రారంభించింది. త‌మ‌న్నా వద్ద రూ. 2 కోట్లు విలువ చేసే ఒక అరుదైన వజ్రం ఉందట. రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ఆ వ‌జ్రాన్ని త‌మ‌న్నాకు గిఫ్ట్ చేసింది. ఇక ముంబైలోని రూ. 16 కోట్లు విలువ చేసే ఒక ప్లాట్, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సొంత ఇళ్ళు త‌మ‌న్నాకు ఉన్నాయి. ల్యాండ్ రోవర్, బెంజ్, బి ఎం డబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు తమన్నా కొనుగోలు చేసింది. మొత్తంగా త‌మ‌న్నా పేరిట రూ. 110 కోట్లు విలువ చేసే ఆస్తి ఉంద‌ని అంటున్నారు.