`శాకుంతలం` సంద‌డి షురూ.. అదిరిపోయే న్యూస్ చెప్పిన సమంత‌!

`యశోద` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం సమంత నుంచి రాబోతున్న చిత్రం `శాకుంత‌లం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

ఇందులో టైటిల్ పాత్ర‌ను స‌మంత పోషించ‌గా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంత మహారాజు పాత్రలో కనిపించబోతున్నాడు. మోహన్ బాబు, మధూ, గౌతమి, అల్లు అర్హ‌, అనన్య నాగళ్ల తదితరులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు. ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయ‌గా.. అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది.

అయితే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ను ప్రారంభించ‌బోతున్నారు. శాకుంత‌లం సంద‌డి షురూ కాబోతోంది. తాజాగా స‌మంత ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే న్యూస్ వెల్ల‌డించింది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌ను ఆమె ప్రకటించింది. మల్లిక అంటూ ఫస్ట్‌ సింగిల్‌ను జనవరి 18న రిలీజ్‌ చేస్తున్నట్లు పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో సమంత దేవకన్యలా ఎంతో అందంగా మెరిసిపోతుంది. మ‌రి ఫ‌స్ట్ సింగిల్ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకోనుందో చూడాలి.

https://twitter.com/SVC_official/status/1614974594242473986?s=20&t=Lp9Kavp_vhHxfgnuD-GvbQ