ఫిబ్రవరి నెలలో పెద్ద హీరోలతో చిన్న హీరోలు ఢీ.. గెలిచేది ఎవరు…

టాలీవుడ్‌కి 2023 సంవత్సరం బాగానే ప్రారంభమైంది. ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టాయి. ఒక సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా, మరో సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా దర్శక నిర్మాతలు ఫిబ్ర‌వ‌రిలో చిన్నా పెద్ద సినిమాల‌ను మిక్స్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు. వాటిలో రైటర్ పద్మభూషణ్, బుట్ట బొమ్మ, వినరో భాగ్యము విష్ణు కథ వంటి చిన్న సినిమాలతో పాటు మైఖేల్ లాంటి మీడియం బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. అమిగోస్, శాకుంతలం, అలాగే ధనుష్ మొదటి తెలుగు చిత్రం SIR వంటి భారీ రిలీజ్‌లు కూడా ఉన్నాయి.

అన్ని సినిమాల ట్రైలర్లు, ప్రమోషన్‌లను చూసుకుంటే అవన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించే లాగానే ఉన్నాయి. వాటిలో కొన్ని విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇది ఫిబ్రవరిని టాలీవుడ్‌ ఇండస్ట్రీకి మరింత జోష్ ఇస్తుంది. ఫిబ్రవరిలో ఎక్కువ సెలవులు, పండగ రోజులు లేకపోయినా మంచి సినిమాలు వస్తున్నాయి. దీంతో ప్రేక్షకులకు సినిమాల పండుగ అని చెప్పవచ్చు. మరి ఏ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయో చూడాలి.

ఇక ఏయే రోజు ఏయే సినిమాలు విడుదలవుతున్నాయో తెలుసుకుంటే.. రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3, బుట్ట బొమ్మ ఫిబ్రవరి 4, మైఖేల్ ఫిబ్రవరి 3, అమిగోస్ ఫిబ్రవరి 10, శాకుంతలం ఫిబ్రవరి 17, వినరో భాగ్యము విష్ణు కథ ఫిబ్రవరి 17, సార్ ఫిబ్రవరి 17. ఈ సినిమాలన్నీ కూడా డిఫరెంట్ స్టోరీలతో వస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి మూవీ లవర్స్ ఫిలిం ఫిబ్రవరి నెల చాలా కిక్ ఇస్తుందని చెప్పొచ్చు.