సమంత ఆ పని చేయకపోతే శాకుంతలం మూవీ ఫ్లాప్ కావడం ఖాయం..?

 

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సామ్. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఇటీవలే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో యశోద సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె కేవలం ఒక్క ఇంటర్వ్యూ లో మాత్రమే పాల్గొంది. ఆ ఒక్క ఇంటర్వ్యూ సినిమాతో ఫ్యాన్స్‌కి, మూవీ యూనిట్‌కి కావాల్సినంత ఎనర్జీ ని ఇచ్చింది. దాంతో మొదటివారంలోనే మంచి టాక్ తెచ్చుకుంది యశోద సినిమా. ఇక ప్రస్తుతం సమంత, గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం అనే చరిత్రాత్మక కథలో కనిపించబోతుంది.

అయితే శాకుంతలం సినిమా కోసం సమంత గట్టిగా ప్రమోషన్స్ చేయడం చాలా అవసరం. ఎందుకు అంటే ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకొచ్చే సామర్ధ్యం కేవలం సామ్ కీ మాత్రమే ఉంది. కాబట్టి సినిమాకి మంచి కలెక్షన్స్ రావాలంటే ప్రమోషన్స్ ఎక్కువగా చేయాలి. అందుకే ఇప్పుడు నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. సమంతతో ఈ సినిమాని ప్రమోట్ చేయించాలి అని వారు అనుకుంటున్నారు.

కానీ ఆమె ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటుంది. ఈ సమయంలో ఆమె ఎక్కువగా ప్రమోషన్స్, ఇంటర్వ్యూ లలో పాల్గొంటే తొందరగా అలిసిపోతుంది. అందుకే ఆమెని మూవీ టీమ్ ఎక్కువగా ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదు. కానీ సమంతకి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అలానే రెమ్యునరేషన్ కూడా ఎక్కువే కావున ఆమె ప్రమోషన్స్ కి దూరంగా ఉంచడం అనేది కరెక్ట్ కాదు. మరి శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం ఆ మూవీ టీమ్ ఎలాంటి స్ట్రాటజీలు యూజ్‌ చేస్తారో చూడాలి ఇక. ఈ సినిమాలో సమంత తప్ప మిగతా నటీనటులు ఎవరికి తెలియదు కాబట్టి ఆమె తప్పనిసరిగాయి సినిమాని ప్రమోట్ చేయాలి లేదంటే సినిమా ఫ్లాప్ అయ్యే ప్రమాదం కూడా ఉందని కామెంట్లు చేస్తున్నారు కొందరు.

 

Share post:

Latest