ఆక‌ట్టుకుంటున్న `బుట్ట‌బొమ్మ‌` ట్రైల‌ర్‌.. చిన్న సినిమా పెద్ద హిట్ కొడుతుందా?

చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కోలీవుడ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా న‌టించిన చిత్రం `బుట్ట‌బొమ్మ‌`. శౌరి చంద్రశేఖర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్‌ మ్యూజిక్ అందించారు. సితార నాగవంశీ, సాయి సౌజన్య(త్రివిక్ర‌మ్ వైఫ్‌) నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది.

ఇప్ప‌టికే ఈ చిత్రంపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే తాజాగా ఆ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేందుకు మేక‌ర్స్ ట్రైల‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. అరకు బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. గ్రామీణస్థాయిలో ఉండే ప్రేమ, పరువు, భయం, రాజకీయాలు అనే అంశాలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

ట్రైలర్ లో తొలి సగం సాఫ్ట్ గా ఉండగా మలి సగం మాత్రం మాస్ ప్రేక్షకులకు మెచ్చేలా ఉంది. అనిఖా త‌న‌దైన ప‌ర్ఫామెన్స్ తో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. నేప‌థ్య సంగీతం, నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తాన్ని చిన్న సినిమాగా వ‌స్తున్న ఈ చిత్రం పెద్ద హిట్ కొడుతుంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share post:

Latest