మ‌ళ్లీ త‌ల్లి అయిన అన‌సూయ‌.. బేబీ బంప్ తో షాకిచ్చిన యాంక‌ర‌మ్మ‌!?

బుల్లితెర స్టార్ యాంకర్, ప్రముఖ నటి అనసూయకు ఆల్రెడీ వివాహం అయింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే అనసూయ మరోసారి తల్లి అయింది. తాజాగా బేబీ బంప్ ఫోటోతో అందరికీ షాక్ ఇచ్చింది. అయితే అనసూయ గర్భం దాల్చింది రియల్ గా కాదులేండి.. రీలే. అన‌సూయ న‌టిస్తున్న చిత్రాల్లో `రంగమార్తాండ`.

కృష్ణవంశీ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్‌, శివాత్మిక రాజశేఖర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఎమోషనల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హౌస్‌ఫుల్‌ మూవీస్‌-రాజ శ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో అన‌సూయ దేవదాసిగా కనిపిస్తారనే వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, అవి పూకార్లుగానే తేలిపోయాయి. తాజాగా అన‌సూయ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో రంగమార్తాండ మూవీ వర్కింగ్ స్టిల్ షేర్ చేశారు. ఆ ఫోటోలో శివాత్మిక పెళ్లికూతురిగా ముస్తాబై ఉంది. పక్కనే ఆమె తల్లిదండ్రులు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఉన్నారు. అదే ఫొటోలో వెన‌క అనసూయ బేబీ బంప్ తో ద‌ర్శ‌న‌మిచ్చింది. దీంతో రంగమార్తాండలో అన‌సూయ ప్రెగ్నెంట్ లేడీ క‌నిపించ‌బోతోంద‌ని స్ప‌ష్ట‌మైంది.

Share post:

Latest