అవంతినే కార్నర్ చేస్తున్నారా? నెక్స్ట్ ఏంటి?

మంత్రి పదవి పోయాక అవంతి శ్రీనివాస్ పేరు పెద్దగా ఏపీ రాజకీయాల్లో వినిపించడం లేదు..ఏదో ఆయన నియోజకవర్గానికే పరిమితం అవుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే కొన్ని ఆరోపణలు ఆయనకు పెద్దగా మైనస్‌గా మారిన విషయం కూడా తెలిసిందే. సరే ఆ విషయాలని వదిలిస్తే తాజాగా అవంతి పేరు మరోసారి వినిపిస్తుంది..అది కూడా ఎందుకంటే ఈ సారి ఎన్నికల్లో ఆయనకు సీటు ఉండదని చెప్పి వార్తా కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో తెలియదు గాని ఈ సారి మాత్రం ఆయనకు జగన్‌ సీటు ఇవ్వరని అంటున్నారు.

అయితే ఇప్పటివరకు పార్టీలు మారుతూ అవంతి గెలుస్తూ వచ్చారు. 2009లో ప్రజారాజ్యంలో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019లో వైసీపీ నుంచి భీమిలి లో గెలిచారు. అలాగే జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా చేశారు. మంత్రిగా పెద్దగా హైలైట్ కాలేదు గాని..కొన్ని వివాదాస్పద అంశాల్లో హైలైట్ అయ్యారు. ఇక తర్వాత మంత్రి పదవి కూడా పోయింది.

ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు..కానీ నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు కూడా ఉండదని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉన్నా సరే, చివరి నిమిషం వరకు టీడీపీ అభ్యర్ధిని ప్రకటించకపోయినా సరే..భీమిలిలో అవంతి గెలిచింది 9 వేల ఓట్ల మెజారిటీతోనే. ఇక గెలిచాక ఆయన బలం ఇంకా తగ్గుతూ వస్తుందని తెలుస్తోంది. ఈ సారి గాని భీమిలి సీటు ఇస్తే ఆయన గెలవడం కష్టమని సర్వేల్లో తేలిందట. దీంతో ఆయనకు సీటు లేదని అంటున్నారు.

కుదిరితే అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతుంది..మరి ఈ సీటు విషయంలో అటు ఇటు అయితే..అవంతి మళ్ళీ పార్టీ మారే ఆలోచన చేస్తారా? వేరే పార్టీలోకి వెళ్తారా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. చూడాలి మరి అవంతి భవిష్యత్ ఏం అవుతుందో?

Share post:

Latest