‘ధూత’లో నాగచైతన్య పాత్ర అదేనా?

నాగ చైతన్య ‘ధూత’ గురించి విన్నారా? అదేనండి అక్కినేని వారసుడు నాగ చైతన్య ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లోకూడా నటిస్తున్నాడు. ఈమధ్య నటుడిగా నిరూపించుకునేందుకు నాగ చైతన్య చాలా ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ధూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో చైతూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తాజాగా ధూతలో నాగ చైతన్య పాత్ర పై కొత్త వార్తలు వస్తున్నాయి.

కాగా ఈ సినిమాలో నాగ చైతన్య ఒక కమర్షియల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నట్టు భోగట్టా. ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ఎంతటి రిస్క్ అయినా తీసుకునేందుకు సిద్దపడే జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా ధూత వెబ్ సిరీస్ మొత్తంగా 8 ఎపిసోడ్స్ లో ప్రేక్షకులను కనువిందు చేయనుంది. ఒకొక్క ఎపిసోడ్ దాదాపు 40 నుండి 45 నిమిషాల నిడివి ఉంటుందట. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ యొక్క వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుందని.. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

OTT దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ ను వచ్చే ఏడాది స్ట్రీమింగ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే థాంక్యూ సినిమా తర్వాత నాగ చైతన్య కస్టడీ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా ద్వి భాషా చిత్రంగా రూపొందుతోంది. కాగా కృతి శెట్టి హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. వచ్చే ఏడాది ధూత మరియు కస్టడీలతో తెలుగు జనాలను చిత్తు చిత్తు చేయనున్నాడు.

Share post:

Latest