కృష్ణ‌ను క‌డసారి చూసేందుకు నాగార్జున రాలేదెందుకు? కార‌ణం ఏంటి?

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా త‌న‌దైన ముద్ర వేసిన‌ ఘట్టమనేని కృష్ణ(79) మంగ‌ళ‌వారం తెల్లవారుజామున క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయ‌న తుది శ్వాస విడిచారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవ‌డంతో ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది.

అభిమానులు కృష్ణ మ‌ర‌ణం ప‌ట్ల క‌న్నీరు మున్నీరు అయ్యారు. ఇక బుధ‌వారం ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జ‌రిగాయి. కృష్ణ‌ను క‌డ‌సారి చూసేందుకు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖ‌ల‌తో పాటు అభిమానులు కూడా భారీగా వ‌చ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. కానీ, అక్కినేని నాగార్జున మాత్రం రాలేదు. సోష‌ల్ మీడియాలో ద్వారా సంతాపం మాత్రం ప్ర‌క‌టించారు. ఇప్పుడీ విష‌య‌మే హాట్ టాపిక్‌గా మారింది. కృష్ణ‌ను అమితంగా అభిమానించే హీరోల్లో నాగార్జున ఒక‌రు.

అటువంటిది కృష్ణ పార్ధీవ దేహానికి నివాళులర్పించడానికి ఆయన ఎందుకు రాలేదు? అన్న ప్ర‌శ్న నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతోంది. నాగార్జున త‌న‌యులు నాగ చైత‌న్య‌, అఖిల్‌లు కృష్ణ కు నివాళులర్పించారు. కానీ, నాగార్జున హాజ‌రు కాక‌పోవ‌డంతో.. కార‌ణం ఏమై ఉంటుందా అని ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. అయితే నాగార్జున వేరె ప్రాంతంలో ఉండి ఉంటార‌ని.. అందుకే కృష్ణ‌ను క‌డ‌సారి చూసేందుకు రాలేద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఈ విష‌యంపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.

Share post:

Latest