రమ్యకృష్ణకు ఆ సినిమా అంత ప్రత్యేకత ఎందుకు..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు నటిగా కెరియర్ కొనసాగించాలంటే అది చాలా కష్టము.కానీ హీరోయిన్లలో రమ్యకృష్ణ మాత్రం యువ హీరోయిన్లకు దీటుగా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియాలో పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. రమ్యకృష్ణ మాట్లాడుతూ డాన్సర్ గా ఎదగాలని రమ్యకృష్ణ తల్లి కూచిపూడి, భరతనాట్యం నేర్పించిందట. అయితే సినిమాల్లోకి రావడం ద్వారా గుర్తింపు వస్తుందని భావించి ఈ రంగంలోకి వచ్చానని ఆమె తెలియజేసింది.

Ramya Krishnan Biography, Height, Weight, Age, Movies, Wife, Family,  Salary, Net Worth, Facts & More - Primes World
అలా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం సినిమాలే తన ప్రపంచంగా మారిపోయాయని తెలియజేసింది. ఖాళీ సమయం దొరికితే చాలు తన కొడుకు రిత్విక్ తో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలియజేసింది. మరింత ఖాళీ సమయం దొరికితే ఎక్కువగా వర్క్ అవుట్ లో చేయడం అలవాటని తెలిపింది. తన కొడుకు తన సినిమాలను చూడడంతో పాటు తన నటన పైన కూడా అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటాడని తెలియజేసింది రమ్యకృష్ణ. కృష్ణవంశీ డైరెక్షన్లో పెళ్లికి ముందు చంద్రలేఖ సినిమాలో నటించానని పెళ్లి తర్వాత శ్రీ ఆంజనేయం సినిమాలో నటించాలని తెలియజేసింది.

Maggie to Neelaambari: Ramya Krishnan's 5 iconic roles in Kollywood
ఇక నరసింహ సినిమాలోని నీలాంబరి పాత్ర తనకు మంచి గుర్తింపు తెచ్చిందని తెలియజేసింది అమ్మోరు సినిమా విడుదలైన సమయంలో ఒక మూవీ షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో అక్కడికి వచ్చిన కొంత మంది మహిళలు తన కాళ్లకు దండం పెట్టి వెళ్లారని తెలియజేసింది. అమ్మోరు మూవీలో రమ్యకృష్ణ కెరియర్లో ఆమెకు చాలా ప్రత్యేకమని తెలియజేసింది. ఈ సినిమా తమిళంలో కూడా సక్సెస్ అయిందని తెలియజేసింది. రమ్యకృష్ణకు ఆదర్శం తమిళనాడు మాజీ సీఎం జయలలిత అని తెలియజేసింది. ప్రస్తుతం రమ్యకృష్ణకు ఒక్కో సినిమాకి రోజుకి 10 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటోందట.