ఊర్వశివో రాక్షసివో.. సెన్సార్ పూర్తి.. ఎలా ఉందంటే..!!

యువ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కలిసి నటించిన తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో. ఈ సినిమాని డైరెక్టర్ రాకేష్ శశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే శుక్రవారం చాలా గ్రాండ్గా థియేటర్ లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను కూడా చాలా వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది ఈ చిత్రము. ఇక బాలకృష్ణ కూడా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ లో చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

Urvasivo Rakshasivo (2022) - Movie | Reviews, Cast & Release Date in  hyderabad - BookMyShow
మరొకవైపు అల్లు సిరీస్ కూడా పలుచోట్ల సందర్శిస్తూ తన సినిమా దూకుడును ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి అయినట్లు మేకర్స్ ప్రకటించారు.

Urvasivo Rakshasivo completes censor | cinejosh.com ఈ సందర్భంగా ఊర్వశివో రాక్షసివో సెన్సార్ బోర్డు సభ్యులు యూఏ సర్టిఫికెట్ను జారీ చేశారని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా నేటి యువతరం భావాలకు అద్దం పట్టే అంశాలతో న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమాని తీర్చిదిద్దినట్లుగా తెలుస్తున్నది.

Urvasivo Rakshasivo Release Date, Star Cast, Trailer, Plot & More Updates  Here - JanBharat Times
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం చెందిన యువకుడు ఒక మోడ్రన్ గర్ల్ తో ప్రేమలో పడితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా యూత్ ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక ఇందులో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి ,ఆమని, శంకర్ తదితరులు నటిస్తూ ఉన్నారు. అల్లు శిరీష్ ,అను ఇమ్మాన్యుయేల్ కెరియర్ని ఈ సినిమా మారుస్తుందేమో చూడాలి.

Share post:

Latest