షాకింగ్‌: నాలుగు రోజుల్లో పెళ్లి.. ఇంకా హాస్పిట‌ల్‌లోనే ఉన్న నాగ శౌర్య‌!

టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య ఇటీవల షూటింగ్లో కళ్ళు తిరిగి కుప్పకూలిన సంగతి తెలిసిందే. దాంతో చిత్ర టీం ఆయన‌ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. నాగశౌర్య కళ్ళు తిరిగి పడిపోవడానికి డీ హైడ్రేషన్ కారణం అని చెప్పిన వైద్యులు.. అవ‌స‌రం అయ్యే ఫ్లూయిడ్స్ ఆయనకు ఎక్కించి చికిత్స అందించారు.

naga shourya in hospital
naga shourya in hospital

అయితే వైద్యులు ఇప్పటివరకు నాగ శౌర్య‌ను డిశ్చార్జ్ చేయలేదు. అసలే ఈ యంగ్ హీరో మరో నాలుగు రోజుల్లో పెళ్లి పీటలెక్క‌బోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషా శెట్టితో శౌర్య ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతున్నాడు. బెంగళూరులోని విటల్ మాల్యా రోడ్ లోని జెడబ్ల్యూ మారియోట్ హోటల్ లో నవంబర్ 20వ తేదీన ఉదయం 11 గంటల 25 నిమిషాలకు నాగశౌర్య, అనూష‌ల వివాహం హిందూ సంప్రదాయ ప్రకారం జ‌ర‌గ‌బోతోంది.

పెళ్లికి మరో నాలుగు రోజులే ఉంది. కానీ ఇంకా నాగ‌ శౌర్య హాస్పిటల్ లోనే ఉండడంతో ఆయన అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరి పెళ్లి సమయానికి నాగ శౌర్య‌ కోలుకుంటాడా..? లేదా..? అన్నది చూడాల్సి ఉంది.

Share post:

Latest