యశోద సినిమా సీక్వెల్స్ పై క్లారిటీ ఇచ్చిన చిత్రం బృందం..!

హరి హరీష్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం యశోద. ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు చిత్ర బృందం.. శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేశారు. మొదటి రోజే రూ.6 కోట్ల కి పైగా గ్రాస్ వసూల్ చేసిన ఈ సినిమా 3 రోజుల్లోనే రూ. 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Samantha Yashoda 2 Days Collection report here | యశోద 2 డేస్ కలెక్షన్స్..  లాభాల్లోకి సమంత మూవీ– News18 Teluguతాజాగా ఈ సినిమా సీక్వెల్స్ పై దర్శకనిర్మాతలు హరిహరీష్, శివలేంక కృష్ణ ప్రసాద్ సక్సెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. యశోద 2 సినిమా గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రపంచంలో ఎప్పటికప్పుడు సరికొత్త క్రైమ్ పుట్టుకొస్తున్నాయి. వాటికి పరిష్కారాలు లభిస్తున్నాయి . ఈ నేపథ్యంలో వచ్చిన యశోదకు మంచి రెస్పాన్స్ లభించింది. అన్ని భాషల నుంచి వస్తున్న స్పందన మాకు మంచి సంతోషాన్ని కలిగిస్తుంది. యశోద 2 విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కు లీడ్ కూడా ఉంది. అయితే ఈ సినిమా సమంత గారి పైనే ఆధారపడి ఉంటుంది.

Yashoda Box Office Collection Day 2 Samantha Ruth Prabhus Film Witnesses  Rise in Earnings Check Report

ఆమె ఆరోగ్యంగా తిరిగి వచ్చిన తర్వాత ఆవిడతో డిస్కస్ చేసి సమంత ఒప్పుకుంటే సీక్వెల్స్ చేస్తాము.. ఒకవేళ యశోద 2 సినిమా చేస్తే అందులో వరలక్ష్మి గారి క్యారెక్టర్ కూడా తప్పకుండా ఉంటుంది అంటూ దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొంత సంతోషాన్ని వ్యక్తం చేసినా సమంత పూర్తిగా కోలుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని కలవర పడుతున్నారు. ఏది ఏమైనా యశోద సినిమా మంచి సక్సెస్ అందుకుంది. కాబట్టి కచ్చితంగా యశోద 2 వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది.

Share post:

Latest