సత్తెనపల్లి తమ్ముళ్ళు వరెస్ట్..తేల్చేది ఎప్పుడు?

వర్గ పోరు అనేది అన్నీ పార్టీల్లో ఉంటుంది..పార్టీ సీటు కోసం, పదవుల కోసం నేతల మధ్య పోరు నడుస్తోంది. ఈ పోరుకు పార్టీల అధినేతలు చెక్ పెట్టాలి…ఆ పోరు మరింత ముదిరితే ఇంకా రచ్చ పెరుగుతుంది. ఇప్పుడు సత్తెనపల్లి టీడీపీలో కూడా అదే జరుగుతుంది. కోడెల శివప్రసాద్ చనిపోయాక..ఆ సీటుకు ఇంచార్జ్‌గా ఎవరిని నియమించలేదు. ఒకవేళ కోడెల తనయుడు శివరాంకు ఇస్తే ఎలా ఉంటుందని చూశారు గాని..ఆయనకు వ్యతిరేకంగా కొన్ని టీడీపీ వర్గాలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు..సత్తెనపల్లి ఇంచార్జ్ పదవి ఇవ్వలేదు.

ఇక ఈ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు పోటీ పడటం మొదలైంది. అటు రాయపాటి రంగబాబు, నాగోతు శౌరయ్య, మన్నెం శివనాగమల్లేశ్వరరావు సైతం..సత్తెనపల్లిపై కన్నేశారు. ఇలా సత్తెనపల్లి టీడీపీలో వర్గ పోరు మొదలైంది. ఎవరికి వారే సెపరేట్ గా రాజకీయం చేస్తూ..పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తున్నారు. అధిష్టానం వార్నింగ్‌లు ఇచ్చిన లెక్క చేయడం లేదు. తాజాగా అయితే కోడెల, వైవీ వర్గాలు కొట్టుకునే వరకు వెళ్లిపోయాయి. ఇప్పటికే కళ్యాణదుర్గంలో రెండు వర్గాలు కొట్టుకున్నాయి.

సత్తెనపల్లిలో.. రచ్చరచ్చ

ఇప్పుడు సత్తెనపల్లిలో టీడీపీ కన్వీనర్ల ఎంపిక సమావేశంలో తమ్ముళ్లు గొడవపడ్డారు. పరిశీలకుల ఎదుటే వాగ్వివాదాలు.. నినాదాలు.. కుర్చీలు విసురుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి ఆశిస్తున్న నాగోతు శౌరయ్య, మన్నెం శివనాగమల్లేశ్వరరావు, డాక్టర్‌ కోడెల శివరాంల నుంచి పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు.

ఇదే క్రమంలో వైవీ ఆంజనేయులు…తన అభిప్రాయాన్ని చెప్పడానికి వెళ్ళగా, లోకల్ వాళ్లే చెప్పాలని కోడెల వర్గం డిమాండ్ చేసింది..ఇక్కడ అంతా లోకలే అని వైవీ వర్గం వాదించింది. ఇక కోడెల వర్గం మరింత రెచ్చిపోయి..రచ్చ లేపింది…అక్కడ ఉన్న పరిశీలకులుని కూడా తిట్టారు. కోడెలను ఇన్‌చార్జిగా ప్రకటించాలని, అరుపులు కేకలతో కుర్చీలను పైకి ఎగరవేస్తూ వారు వీరంగం సృష్టించారు.

దీంతో పరిశీలకులు ఆగ్రహానికి లోనై..తమ అనుచరులని బయటకు తీసుకెళ్లాలని చెప్పడంతో కోడెల..తన అనుచరులతో సమావేశం నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇంచార్జ్ పదవి ఫిక్స్ చేసేవరకు సత్తెనపల్లిలొ రచ్చ జరిగేలా ఉంది..ఈ రచ్చ వల్ల పార్టీకి మరింత డ్యామేజ్ జరుగుతుంది..కాబట్టి ఈ సీటు విషయంలో ఏదొకటి తేల్చేస్తే బెటర్.

Share post:

Latest