వ‌ణికించే చ‌లిలో వేడి పుట్టించిన స్నేహా రెడ్డి..ఈ బ‌రితెగింపు అందుకేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. వరంగల్ కు చెందిన స్నేహా రెడ్డి.. అమెరికాలో మాస్ట‌ర్స్ చేసి హైద‌రాబాద్ కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత అల్లు అర్జున్ తో ప్రేమలో పడి అల్లు వారి ఇంటికి కోడలు అయింది.

అయితే స్నేహా సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లోనే ఈమెకు ఏకంగా 8.5 మిలియన్ల కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇటీవల స్నేహా రెడ్డి అందాల ఆరబోతకు తెరలేపింది. తరచూ హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్ర‌కారును క‌వ్వించే ప్రయత్నం చేస్తోంది.

తాజాగా కూడా స్లీవ్ లెస్ ట్రెండీ డ్రెస్ లో మతి పోగొట్టే విధంగా ఫోటోల‌కు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం స్నేహారెడ్డి తాజా పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చూసి వ‌ణికించే చ‌లిలో స్నేహా రెడ్డి తన అందాలతో వేడి పుట్టించిందంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు సినిమాల్లోకి రావడానికే స్నేహారెడ్డి ప్రయత్నిస్తోందని, అందుకే ఇలా బ‌రితెగించి గ్లామర్ షో చేస్తోందని పలువురు నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest