సమంత: యశోద మూవీ రివ్యూ.. హైలెట్ అదేనా..?

టాలీవుడ్ లో సమంత ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా తన హవా కొనసాగిస్తూనే ఉంది సమంత. కొన్ని సినిమాలు కేవలం సమంత క్రేజ్ తోనే నడిచాయని చెప్పవచ్చు. ఇక తాజాగా సమంత నటించిన యశోద చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఈ చిత్రంతో సమంత సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయం తెలుసుకుందాం.

Yashoda: Samantha Starrer Does A Record-Breaking Business Before Release  For The Actress, Here's Its Theatrical Rights Price & Much More

దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత సమంత చిత్రం విడుదల కావడంతో అభిమానుల సైతం చాలా సంబరపడుతున్నారు. ముఖ్యంగా యశోద చిత్రంలో సమంత ఒక గర్భవతి పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు సైతం సమంత నటన చాలా అద్భుతంగా ఉందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు అద్భుతమైన నటనను ప్రదర్శించారని తెలియజేశారు. డైరెక్టర్ హరి హరి శంకర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని తెలియజేస్తున్నారు. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలో కూడా బాగానే స్పందన లభిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

Samantha's fans go crazy ahead of 'Yashoda' release, display huge posters  of the actress across cities | Regional News | Zee Newsయశోద సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిందని విషయాన్ని తెలియజేస్తున్నారు.ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ లైన్ తో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సరోగసి ఆసుపత్రిలో ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో ఈ సినిమా చాలా మలుపు తిరుగుతుందని సినిమా చూసిన ప్రేక్షకుల సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాలు ఈ చిత్రానికి హైలైట్ గా ఉందని తెలిపారు. ఇంటర్వెల్ తర్వాత ఈ సినిమా చాలా థ్రిల్లింగ్ గా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ఓవరాల్ గా సమంత ఈ చిత్రంతో సక్సెస్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి కలెక్షన్ల పరంగా సమంత ఎలాంటి సత్తా చారుతుందో చూడాలి.

Share post:

Latest