ఇమ్మాన్యుయేల్, వర్ష విడిపోవటానికి కారణాలు ఇవేనా? కన్నీళ్లు పెట్టుకోవడానికి అసలు కారణం ఇదే!

ఫేమస్ కామెడీ తెలుగు షో జబర్దస్త్ గురించి తెలియని వారు వుండరు. తెలుగు వారు ఎవ్వరికైనా కాస్త అసహనంగా వున్నా, బోర్ కొట్టినా ముందుగా గుర్తొచ్చేది ఈ షోనే. ఈ షో చూసిన తరువాత కాస్త ఉపశమనం ఫీల్ అవుతూ వుంటారు. ఇకపోతే ఈ షోలో సుడిగాలి సుధీర్ – రష్మీ జోడీ ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. వారి తర్వాత ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న జోడీ ఏదన్న వుంది అంటే, అది ఇమ్మాన్యుయేల్ – వర్ష జోడీ అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఈ జోడీకి ప్రేక్షకుల్లో ఎటువంటి గుర్తింపు వుందో చెప్పాల్సిన పనిలేదు. నిన్న మొన్నటి వరకు ఈ జోడీ కలిసి క్కట్టుగా స్కిట్లు చేయగా ప్రస్తుతం ఈ జోడీ స్కిట్లు చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని జబర్దస్త్ వర్గాలలో గుసగుసలు వినబడుతున్నాయి. విషయం ఏమంటే, సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్ల వల్లే ఈ జోడీ కలిసి స్కిట్లు చేయడానికి ధైర్యం చేయడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో ఇమ్మాన్యుయేల్ నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని పాట పాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఫుటేజ్ చూసేవుంటారు.

ఈ నేపథ్యంలో రష్మీ ఇమ్మాన్యుయేల్ వర్షలను… అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదా మీ మధ్య? అని అడగడంతో, అది ఎప్పటికీ మారదు! అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఏమైంది? విషయం ఏమిటి వర్ష? అని ఇంద్రజ అడగగా వర్ష తల దించుకుంది. కాగా ఈ ఏడాది నవంబర్ నెల 6వ తేదీన ఈ ఎపిసోడ్ బుల్లితెరపై పూర్తిగా ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ లో వర్ష విడిపోవడానికి ఎలాంటి కారణాలను చెబుతుందో వేచి చూడాలి మరి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Share post:

Latest