మహేష్ బాబు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఆ విషయంలో మళ్ళీ అదే జరిగింది!

2022 సంవత్సరం మహేష్ బాబు జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. అతని తల్లి ఇందిరాదేవి ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించారు. సోదరుడు రమేష్ బాబు జనవరిలో చనిపోయాడు. ఇప్పుడేమో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఇలా ఒకే ఏడాదిలో తనకెంతో ఎంతో ప్రియమైన వారిని మహేష్ కోల్పోవడం ఫ్యాన్స్‌ని ఎంతగానో కలచి వేస్తోంది.

ఈ సంవత్సరం అంతటా మహేష్ తన కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధతోనే గడుపుతున్నారడు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడం సాధ్యం కావడం లేదు. అలాగే ఎస్ఎస్ రాజమౌళితో కలిసి తన అప్‌కమింగ్ సినిమాని ముందుకు తీసుకెళ్లడం అసలు కుదరడం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన జక్కన్న మహేష్ తో ఎలాంటి కళాఖండం తెరకెక్కిస్తాడో అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఏదైనా అప్‌డేట్ వస్తుందేమోనని చాలా రోజులుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుపోతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో రాజమౌళి సినిమా నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవచ్చని తెలుస్తోంది.

ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ అంటున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీలో మహేష్ బాబు అడవిలో నరమాంసభక్షకులతో ఫైట్ చేస్తాడట. మళ్లీ ఇతని పక్కన ఒక బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఈ సినిమా అభిమానుల్లో విపరీతమైన హైప్‌ తెచ్చుకుంటుంది. కానీ మహేష్ బాబు ఆల్రెడీ ఒప్పుకున్న త్రివిక్రమ్ సినిమాని కొంచెం కూడా పూర్తి చేయలేకపోయాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాని మహేష్ పూర్తి చేయాలనుకుంటున్నాడు కానీ అతనికి ఈ సంవత్సరం అంతా టైం ఏం బాగోలేదు. సో, షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఏ మూవీ షూటింగ్ డిసెంబర్‌లో స్టార్ట్ చేద్దామనుకుంటున్నారు కానీ అది సాధ్యమవుతుందా కాదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే. పితృవియోగం నుంచి మహేష్ కోలుకుంటేనే అతని నుంచి ఒక సినిమా వచ్చే ఏడాదిలో చూసే అవకాశం ఉంటుంది. లేదంటే అభిమానులకు నిరాశ ఎదురవుతుంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం కావాల్సిన ఆర్టిస్టుల డేట్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Share post:

Latest