డెనిమ్‌ షార్ట్స్‌లో బీభత్సంగా అందాలు ఆరబోసిన పాయల్ రాజ్ పుత్..

ఆర్ఎక్స్‌ 100 సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నటి పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం పాయల్ తన లేటెస్ట్ ఫొటో షూట్ కీ సంబందించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఆ వీడియోలో పాయల్ నాటీ ఫోజులు హాట్‌గా ఉన్నాయి. ఈ వీడియో కుర్రాళ్లకు కిక్ ఇస్తుండగా నెటిజనులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం కెరీర్‌లో పాయల్‌కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. రేర్‌గా వచ్చే అవకాశాలతో కాలం ఈ పాప కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. మొదట సినిమాతో మంచి విజయం సాధించినా ఆ క్రేజ్‌ను పాయల్ ఉపయోగించుకోలేకపోయింది. వరుస ఫ్లాప్ లు ఆమెను దెబ్బతిసాయి.

మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమాలో పాయల్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటించారు. కొద్ది రోజుల క్రితమే ఈ జిన్నా సినిమా విడుదల అయింది. ఈ సినిమా కూడా పాయల్‌కి హిట్ ని అందించలేకపోయింది. పాయల్ నటించిన తీస్మార్‌ ఖాన్ సినిమాలు రోజుల వ్యవధిలోనే రిలీజ్ అయ్యాయి. కానీ ఈ రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ప్రస్తుతం ఈ అమ్మడు థ్రిల్లర్ మూవీ ‘మాయా పేటిక’ సినిమాలో యాక్ట్ చేస్తోంది. దర్శకుడు రమేష్ రాపర్తి ఈ సినిమాలో మొబైల్ వినియోగం వల్ల వచ్చే దుష్ప్రభావాలను చూపింనున్నారు. సునీల్, హిమజ, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించబోతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

సీరియల్ యాక్టర్‌గా తన కెరీర్ మొదలు పెట్టిన పాయల్ rx100 సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2018లో విడుదల అయిన rx100 సినిమా పాయల్ కి సంచలన విజయాన్ని అందించింది. ఈ సినిమాలో పాయల్ గ్లామర్, బోల్డ్ సీన్స్‌లో నటించి కుర్రకారుకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. తర్వాత వెంకటేష్ నటించిన ‘వెంకీ మామ’ సినిమా చేసింది. రవితేజతో నటించిన డిస్కో రాజా మూవీ ప్లాప్ అయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయాలు సాధిస్తేనే అవకాశాలు వస్తాయి. అలాంటిది అతి తక్కువ విజయాలను అందుకున్న పాయల్ ని దర్శకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా పాయల్ చాలా కాలంగా సౌరబ్ దిగ్రామ్‌ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు, అతనితో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

Share post:

Latest