`ఎన్టీఆర్ 30` బ్యాక్‌డ్రాప్ లీక్‌.. తార‌క్ కొత్త ప్ర‌యోగం ఫ‌లిచేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తారక్ కు ఇది 30వ ప్రాజెక్ట్ కావడంతో `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు.

నందమూరి కళ్యాణం ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్ల‌బోతుంది. అయితే తాజాగా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ లీక్ అయింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. `ఎన్టీఆర్ 30` వాటర్ బేస్డ్ మూవీ అని తెలుస్తోంది.

NTR 30 To Get More Delay
NTR 30 To Get More Delay

ఇప్పటికే `ప్యూరీ ఆఫ్ ఎన్టీఆర్ 30` పేరుతో విడుదలైన మోషన్ పాస్టర్ లో నీళ్లు ప్రధానంగా చూపించారు. సముద్ర తీరాన పడవల మధ్యలో ఒక చేత్తో గొడ్డ‌లి, మరొ చేత్తో కత్తి పట్టుకుని ఉన్న తారక్‌ బ్యాక్ సైడ్ లుక్ ను చూపించారు. ఈ మోషన్ పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. అయితే ఈ సినిమా వాటర్ బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుందని.. త్వరలో ఓ భారీ వాటర్ ఫైట్ ఎపిసోడ్ తోనే షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక తారక్ ఇంతవరకు ఇటువంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసింది లేదు. మరి ఈయ‌న కొత్త‌ ప్రయోగం ఫలిస్తుందా లేదా అన్నది చూడాలి.

Share post:

Latest