అలాంటి వాడు దొరికితే వెంట‌నే పెళ్లి చేసుకుంటా: నిత్యామీన‌న్

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉండే ఈ మలయాళ ముద్దుగుమ్మ.. అందం అభినయం మరియు నటన ప్రతిభతోనే సౌత్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం నిత్యామీనన్ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ ల‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే పలు టీవీ షోలకు జడ్జ్ గా సైతం వ్యవహరిస్తూ కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. కెరీర్ విషయం పక్కన పెడితే.. 34 ఏళ్ల నిత్యామీనన్ ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందా అని ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కానీ, ఆమె పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు.

అయితే నిత్యా మీనన్ తాజాగా తనకు ఎలాంటి వాడు కావాలో వివరించింది. నిత్యామీనన్ మాట్లాడుతూ.. ` నేను ఇండియా వేదిక్ క‌ల్చ‌ర్ ను గ‌ట్టిగా న‌మ్ముతా. పెళ్లంటే అది ఒక సోషల్ సెటప్. అంటే ఫైనాన్షియల్ గా ముడిపడి ఉన్న సెటప్. నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. అంతకుమించి ఏదైనా ఉంటే ఆలోచిస్తా. ఎవరైనా దానికి మించి ఆలోచించే వాళ్ళు దొరికితే వెంట‌నే పెళ్లి చేసుకుంటా` అంటూ చెప్పుకొచ్చింది. మరి నిత్యామీనన్ కి అలాంటి వాడు ఎప్పటికి దొరుకుతాడో చూడాలి.

Share post:

Latest