బేబీ బంప్ తో ద‌ర్శ‌న‌మిచ్చిన నిత్యా మీన‌న్‌.. ఖంగుతిన్న ఫ్యాన్స్‌!

ప్రముఖ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యమీనన్ తాజాగా బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ అమ్మడు ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేస్తున్నట్టుగా పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. పాజిటివ్ వచ్చిన ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్ట తో పాటు పాలపీకను కూడా పంచుకుంది.

దీంతో పెళ్లి కాకుండానే నిత్యా మీనన్ తల్లి అయ్యిందంటూ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. నెటిజ‌న్లు నిత్యా మీన‌న్‌పై ట్రోల్స్ కూడా చేశారు. అయితే తాజాగా ఈ బ్యూటీ ఏకంగా బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. ఈమె తాజా ఫోటోలు చూసి అభిమానులు ఖంగు తింటున్నారు.

అయితే ఈ సంద‌ర్భంగా నిత్యామీనన్ తన ప్రెగ్నెన్సీ వెనుక అసలు విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం నిత్యామీనన్ మలయాళం లో `వండర్ ఉమెన్` అనే సినిమా చేస్తోంది. ఆరుగురు గర్భిణీ స్త్రీలు ప్రీ-నేటల్ ట్యూటర్ మార్గదర్శకత్వంలో మాతృత్వాన్ని పొందుతారు.

ఇందులో నిత్యా కూడా `నోరా` అనే గర్భిణీగా న‌టిస్తోంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగానే నిత్యా మీనన్ ఇలా బేబీ బంప్ తో దిగిన ఫోటోలు షేర్ చేసింది. మొత్తానికి నిత్యా మీన‌న్‌ తనది రీలే కానీ.. రియల్ ప్రెగ్నెన్సీ కాదని తేల్చేసింది.

Share post:

Latest