ఛీ.. ఛీ.. ఆస్తి కోసం అలాంటి జబ్బు ఉన్న వ్య‌క్తిని త‌మ‌న్నా పెళ్లాడుతుందా?

మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలెక్క‌బోతోందంటూ గత రెండు రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ఓ బ‌డా వ్యాపారవేత్తతో తమన్నా ఏడ‌డుగులు నడవబోతోందట. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లోనే నిశ్చితార్థం.. ఆపై పెళ్లి ఉంటుందని టాక్ నడుస్తుంది.

అయితే తాజాగా తమన్నా వివాహం చేసుకోబోయే అబ్బాయి గురించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట‌ వైరల్ గా మారింది. అదేంటంటే సదరు అబ్బాయికి కోట్లలో ఆస్తిపాస్తులు ఉన్నాయట. ముంబైలో టాప్ బిజినెస్ మాన్ గా కొనసాగుతున్నాడట. అయితే అతడికి ఓ వింత జ‌బ్బు ఉందట. అదేంటంటే అతని ఒంటికి పడని ఫుడ్ ఏదైనా తింటే వెంటనే రియాక్షన్ జరిగి స్కిన్ ర్యాషెస్ వచ్చేస్తాయట.

వాటిని ఆలస్యంగా గుర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం అవుతుందట. ఇటువంటి వింత వ్యాధితో స‌దరు అబ్బాయి బాధపడుతున్నప్పటికీ.. ఆస్తి కోసం తమన్నా అతడితో పెళ్లికి సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచార ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ విషయంలో తమన్నాపై కొందరు నెటిజ‌న్లు `ఛీ.. ఛీ.. ఆస్తి కోసం అలాంటి జబ్బు ఉన్న వ్య‌క్తిని పెళ్లి చేసుకోవాలా?` అంటూ విమర్శల వ‌ర్షం కురిపిస్తున్నారు. మరి ఇప్ప‌టికైనా ఈ పెళ్లి వార్తలపై తమన్నా నోరు విప్పుతుందా..? లేదా..? అన్నది చూడాలి.

Share post:

Latest