పెళ్లిలో భోజనానికే కోట్లు ఖర్చు చేసిన నాగశౌర్య..రాజుల కాలం నాటి రాయల్ లంచ్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో చాలా సైలెంట్ గా ఉండే నాగశౌర్య బెంగళూరుకి సంబంధించిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో లవ్ లో పడ్డాడు . కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన అనూషతో ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసిన నాగశౌర్య.. ఆ తర్వాత ఇద్దరు మనసులు కలవడంతో.. అభిప్రాయాలు కలవడంతో ఆ స్నేహం ప్రేమగా మారింది . కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్న ఈ జంట తమ ప్రేమని ఇంట్లో పెద్దలకు చెప్పి.. ఒప్పించి నిన్న బెంగళూరులో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు .

ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సాంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకున్న నాగశౌర్య – అనూష తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకున్నారు .ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. కాగా నాగశౌర్య పెళ్లికి వచ్చిన గెస్ట్లు సినీ సెలబ్రిటీస్ ఫ్రెండ్స్ అందరూ నాగశౌర్య చేసిన మర్యాదల గురించి ..పెళ్లిలో పెట్టిన భోజనం గురించి చర్చించుకుంటున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ సాంప్రదాయ ప్రకారం రాచరికపు పద్ధతిలో భోజనాలను వడ్డించి షాక్ కి గురి చేశాడు టాలీవుడ్ యంగ్ హీరో.

ఒక్కోక్కరికి ఒక్కో టేబుల్ ఏర్పాటు చేసి రాయల్ లంచ్ ను స్పెషల్ ట్రీట్ గా అందించాడు. ఇందులో దాదాపు 27 రకాల వంటకాలు ఉన్నట్లు తెలుస్తుంది . మొత్తంగా 10 రకాల స్వీట్లతో భోజనాన్ని స్పెషల్ గా మార్చేసాడట . అంతేకాదు పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు నాగశౌర్య అరేంజ్ చేసిన ఈ పద్ధతికి ఫిదా అవుతున్నారు . దాదాపు 5 కోట్లు భోఝనానికి ఖర్చు చేసారట. ప్రతి బిగ్ స్టార్స్ బఫెట్ లాగే భోజనాలు పెడుతున్న ఈ జనరేషన్లో నాగశౌర్య రాయల్ పద్ధతిలో ఇలా భోజనాలు క్రియేట్ చేయడం చాలా కొత్తగా ఉంది అంటూ పొగిడేస్తున్నారు. దీంతో నాగశౌర్య పెళ్లి భోజనాల వంటకాలు ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest