కాబోయే భర్త మొదటి పెళ్లికి పోయి ఎంజాయ్ చేసిన హన్సిక.. విషయమేంటంటే!

అందాల తార హన్సిక మస్కా, దేశముదురు, కంత్రి, జయీభవ, కందిరీగ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఈ ఏడాదిలో ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు సినిమాల్లో, నాలుగు తమిళం సినిమాలలో నటిస్తోంది. అంతేకాదు ఇదే ఏడాదిలో ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బిజినెస్‌మ్యాన్ సోహైల్ ఖతూరియాని పెళ్లి చేసుకోనుంది. ఇప్పటికే అతడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ వద్ద సోహైల్ తనకు ప్రపోజ్ చేసినట్లు ఆమె వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా షేర్ చేసింది.

డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని ప్యాలెస్ హోటల్‌లో హన్సిక, సోహైల్ వివాహం జరగనుంది. ఇదిలా ఉండగా సోహైల్ ఖతూరియా మొదటి పెళ్లికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సోహైల్ గతంలో రింకీ బజాజ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె హన్సికకు క్లోజ్ ఫ్రెండ్ అట. ఈ వీడియో క్లిప్‌లో సోహైల్ మొదటి వివాహ వేడుకల్లో హన్సిక మోత్వాని డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

 

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

ఇప్పుడు హన్సికకు కాబోయే భర్త సోహైల్ గతంలో హన్సికకు కామన్ ఫ్రెండ్ అయిన రింకీ బజాజ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫ్రెండ్ మొగుడినే పెళ్లి చేసుకోనున్న హన్సిక అతడితో ఎనిమిదేళ్లుగా ఫ్రెండ్‌గా మెలిగినట్లు తెలుస్తోంది. అంటే వీరి ముగ్గురు ఫ్రెండ్స్ లాగానే కలిసున్నారు. ఇదిలా ఉండగా హన్సిక ఎంత బిజీగా ఉన్నా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ముద్దుగుమ్మ కాజల్, నయనతార వలె ఒక ఇంటి ఇల్లాలు కానుంది. నిజానికి హన్సిక వయసు 31 ఏళ్లే. కానీ ఈ తార ఇతర హీరోయిన్లతో పోలిస్తే ముందుగానే పెళ్లి పీటలు ఎక్కుతోంది.

Share post:

Latest