`ఎన్టీఆర్ 30`.. హాట్ టాపిక్ గా మారిన‌ అనిరుధ్ రెమ్యున‌రేష‌న్!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెర‌కెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్క‌బోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ నిర్మించబోతున్నారు. అలాగే త‌మిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్ల‌బోతుంది. ఇటీవల‌ కొరటాల అనిరుధ్ తో సంగీత చర్చలు సైతం షురూ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం బయటకు వచ్చి నెట్టింట‌ చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు అనిరుధ్‌ అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్-అనిరుధ్‌ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రమిది.

పైగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్ 30 కి తన మార్క్‌ మ్యూజిక్ అందించాలని అనిరుధ్ డిసైడ్ అయ్యాడ‌ట‌. అంతేకాదు, ఈ సినిమాకు అనిరుధ్ ఏకంగా రూ. 6 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా మేకర్స్‌ సైతం అతను అడిగిన మొత్తం ఇచ్చేందుకు సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. మరి ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ `ఎన్టీఆర్ 30` కి ఎలాంటి స్వరాలను నుంచి ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.

Share post:

Latest