`య‌శోద‌` కోసం స‌మంత అంత‌లా క‌ష్ట‌ప‌డిందా..నోరెళ్ల‌బెడుతున్న నెటిజ‌న్స్‌!

సమంత ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన తాజా చిత్రం `యశోద` హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్ పై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మ‌ల‌యాళ‌ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

ఇందులో సమంత గ‌ర్భిణీ స్త్రీ పాత్ర‌లో నటన పరంగానే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లోనూ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా అదరగొట్టేసింది. విమర్శకులు సైతం ఆమె పై ప్రశంసలు కురిపించారు. అయితే యశోద కోసం సమంత ఎంతగానో కష్టపడింది. డూప్‌ లేకుండా యాక్షన్ సీన్స్ లో చెల‌రేగిపోయింది.

తాజాగా మేక‌ర్స్ యాక్షన్ జర్నీ ఆఫ్ యశోద పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో యశోద సినిమా కోసం సమంత ఎంతలా కష్టపడిందో చూపించారు. అలాగే సినిమా విడుదలకు ముందు సమతో సమంత ఇంటర్వ్యూ ను కూడా మిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. సమంత కష్టాన్ని చూసి అభిమానులే కాదు నెటిజ‌న్లు సైతం నోరెళ్ల‌డుతున్నారు. కాగా, మ‌యోసైటిస్ అనే ప్రాణాంత‌క వ్యాధి కార‌ణంగా స‌మంత ఇంటికే ప‌రిమితం అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె ఆ వ్యాధి నుంచి కోలుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

Share post:

Latest