గాడ్ ఫాదర్ చిత్రానికి నష్టాలు వస్తాయా.. నిజమెంత..!!

టాలీవుడ్ పరిశ్రమలో కరోనా విలయతాండవం సృష్టించింది. కరోనా దెబ్బకు ఇప్పటికి కోలుకోలేకపోతోంది తెలుగు సినీ ఇండస్ట్రీ. అయితే ఎన్నో చిత్రాలు విడుదలై మంచి విజయాలను అందుకున్న అంతగా కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. అలా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయని చెప్పవచ్చు. దసరా పండుగ సందర్భంగా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కావడం జరిగింది.ఆ చిత్రాలలో మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు.

Godfather Movie Review: Chiranjeevi's Fan Service Walks The Staple Path On  Which Leaves Fly Every time He Lifts His Foot
ఈ చిత్రం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతోంది. కానీ ఇప్పుడే ట్రెండ్ వర్గాలలో టాక్ అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు నిలకడ వసూలు బాగానే వస్తున్నాయి.అయినా కూడా ఈ చిత్రానికి నష్టాలు తప్పవని ట్రెండ్ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అయితే అందుకు గల కారణం ఏమిటంటే ఏ పెద్ద హీరో సినిమాకి అయినా ఓపెనింగ్స్ చాలా ముఖ్యం కానీ ఈ చిత్రానికి అనుకున్నంత రేంజ్ లో ఓపెనింగ్స్ రాబట్ట లేకపోయింది అంతేకాకుండా టికెట్ ధరలతో అవి మంచి ఓపెనింగ్స్ సే కానీ మొదటి వారం టికెట్ ధరలతో అయితే 20-25% వరకు వసూళ్లను రాబట్టడం జరిగి ఉంటుంది.

మిగతా సినిమా టాక్ ను బట్టి కూడా ఈ సినిమా పైన ఆధారపడి ఉంటుంది. అయితే గాడ్ ఫాదర్ సినిమా కి యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టాయి. కానీ స్టడీగా వసూళ్లను కొనసాగుతూ ఉన్నాయి. మరి ఫైనల్ గా జరిగిన రూ. 90 కోట్ల బిజినెస్ అందుకోవడం అంటే ఈ విషయం చాలా కష్టమై అని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇది ఎంతవరకు సాధ్యం అనే విషయం ప్రతి ఒక్కరిలోనూ చాలా ఆసక్తిగా మారుతుంది. అయితే ఒకవేళ నష్టాలు వచ్చినా కూడా రూ.10 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.