ట్రైలర్: కామెడీ ట్రాక్ తో సక్సెస్ కొట్టేలా ఉన్న మంచు విష్ణు..!!

మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న చిత్రం జిన్నా. మోహన్ బాబు సమర్పణలో కోన వెంకట్ ఈ సినిమాకి కథ అందించారు. ఇక ఈ సినిమాలో విష్ణు సరసన సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్ట్ చేస్తూ సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక దసరా కానుక ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత అక్టోబర్ 21న పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం.

ginna trailer, Manchu Vishnu: Jinna Movie Trailer.. Manchu Vishnu Festival Treat – manchu vishnu sunny leone and paayal rajput starrer ginna movie trailer released
తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయక ఈ సినిమా ట్రైలర్ అత్యంత వినోదాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో మంచు విష్ణు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మునుపేన్నడు లేనివిధంగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమా కూడా హర్రర్ కామెడీతో తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ చూస్తే మనకి కనిపిస్తోంది. ఇక మంచు విష్ణు ఎంట్రీ కూడా అదిరిపోయేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కూడా చాలా సస్పెన్స్ గా ఉండేలా కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో దయ్యం ఎవరు సన్నిలియోన్ కు ఆ దయ్యానికి గల సంబంధం ఏమిటి..? పాయల్ విష్ణు ప్రేమ మధ్య ఆమె ఎందుకు ఎంట్రీ ఇచ్చింది అనే విషయం తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో కమెడియన్ సద్దాం కూడా తన టైమింగ్ ప్రేక్షకులను మరొకసారి ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని డైలాగులు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో సునీల్, వెన్నెల కిషోర్ ,రఘుబాబు తదితర కమెడియన్సు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest